indraneel: అప్పట్లో 'అతడు' సినిమాలో విలన్ గా అవకాశం వచ్చింది: ఇంద్రనీల్

  • 'చక్రవాకం' మంచి పేరు తెచ్చింది
  •  నెలకి 25 రోజులు పనిచేయవలసి వచ్చేది
  •  బిజీ కారణంగా సినిమాలు చేయలేకపోయాను
బుల్లితెర ప్రేక్షకుల అభిమానాన్ని గెలుచుకున్న నటుల్లో ఇంద్రనీల్ ఒకరుగా కనిపిస్తాడు. తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, తనకి సంబంధించిన ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నాడు. "నేను 'చక్రవాకం' సీరియల్ చేస్తున్నప్పుడే నాకు 'అతడు' సినిమాలో విలన్ గా చేసే అవకాశం వచ్చింది. నా పాత్రకి సంబంధించి 20 రోజుల షూటింగు కూడా జరిగింది.

అయితే 'చక్రవాకం' సినిమాకి నెలలో 25 రోజులు పనిచేయవలసి వచ్చేది. అందువలన ఇటు 'చక్రవాకం' .. అటు 'అతడు' సినిమాను చేయడం కుదరలేదు. దాంతో 'అతడు' సినిమా వాళ్లు ఇక నన్ను వదిలేసి, ఆ పాత్రకు అజయ్ ని తీసుకున్నారు. నేను ఆ పాత్రను గనుక చేసి వుంటే ఇండస్ట్రీలో మంచి విలన్ గా ఎదిగేవాడినేమో. ఇప్పటికీ అవకాశం వుంది .. ఆ స్థాయికి చేరుకోవాలనే ఉద్దేశంతోనే ఇప్పుడు సినిమాలపై ఎక్కువగా దృష్టిపెట్టాను" అని చెప్పుకొచ్చాడు. 
indraneel

More Telugu News