Hyderabad: లండన్ లో హత్యకు గురైన హైదరాబాద్ యువకుడు

  • కెఫేలో పనిచేస్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు దాడి
  • ఆరేళ్లుగా లండన్‌లో ఉంటున్న నజీముద్దీన్‌
  • మృతుని భార్య కూడా అక్కడే డాక్టర్‌
లండన్‌లోని ఓ కెఫేలో పనిచేస్తున్న నజీముద్దీన్‌ అనే హైదరాబాద్‌ యువకుడిని దుండగులు హత్య చేశారు. హైదరాబాద్‌లోని నూర్‌ఖాన్‌ బజార్‌కు చెందిన మొహ్మద్‌ నజీముద్దీన్‌ గడచిన ఆరేళ్లుగా లండన్‌లోనే నివాసం ఉంటున్నారు. నజీముద్దీన్‌ భార్య కూడా అక్కడే డాక్టర్‌గా పనిచేస్తున్నారు. గురువారం గుర్తు తెలియని వ్యక్తులు కెఫేకు వచ్చి అతనిపై దాడిచేసి చంపేశారు. ఈ ఘటనకు సంబంధించి కారణాలు తెలియరాలేదు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని నిందితుని కోసం వేట ప్రారంభించారు.
Hyderabad
noorkhanbajar
London
murder in cafe

More Telugu News