Mahesh Babu: తెలుగు రాష్ట్రాల్లో 'మహర్షి' తొలిరోజు షేర్

  • మహేశ్ 25వ సినిమాగా 'మహర్షి'
  • తొలిరోజున భారీ వసూళ్లు 
  • మరింతగా వసూళ్లు పెరిగే ఛాన్స్   
మహేశ్ బాబు 25వ సినిమాగా 'మహర్షి' నిర్మితమైంది. పూజా హెగ్డే కథానాయికగా నటించిన ఈ సినిమా నిన్న థియేటర్లకు వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా తొలి రోజున భారీ వసూళ్లను రాబట్టింది. తొలిరోజున ఈ రెండు రాష్ట్రాల్లోనూ కలిపి ఈ సినిమా 24.6 కోట్ల షేర్ ను సాధించింది. మహేశ్ బాబు కెరియర్లో తొలి రోజున అత్యధిక వసూళ్లను సాధించిన సినిమా ఇదేనని చెబుతున్నారు.

ఇక ఈ రోజు నుంచి ఆదివారం వరకూ ఈ సినిమా వసూళ్లు మరింతగా పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. ఆ తరువాత కూడా పోటీకి వచ్చే పెద్ద చిత్రాలేవీ దగ్గరలో లేవు. అందువలన 'మహర్షి' వసూళ్ల జోరు మరిన్ని రోజులపాటు కొనసాగే అవకాశాలు పుష్కలంగా వున్నాయనే టాక్ వినిపిస్తోంది. ఆసక్తికరమైన కథాకథనాలు .. మహేశ్ బాబు డిఫరెంట్ లుక్స్ .. పూజా హెగ్డే గ్లామర్ .. వంశీ పైడిపల్లి టేకింగ్ ఈ సినిమాకి ఈ స్థాయి వసూళ్లు రావడానికి కారణమయ్యాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
Mahesh Babu
pooja hegde

More Telugu News