balakrishna: బాలయ్య సినిమాలో లేడీ విలన్ గా వరలక్ష్మి

  • శరత్ కుమార్ తనయ వరలక్ష్మి
  • పవర్ ఫుల్ పాత్రలో జగపతిబాబు
  • మే 17న సినిమా ప్రారంభం

నందమూరి బాలకృష్ణ హీరోగా కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించి ఒక అప్ డేట్ అందుతోంది. అదేంటంటే... బాలయ్యకు లేడీ విలన్ గా వరలక్ష్మి నటించబోతోంది. తమిళ సీనియర్ హీరో శరత్ కుమార్ కుమార్తె వరలక్ష్మి. ఇప్పటికే పలు చిత్రాల్లో వరలక్ష్మి నెగెటివ్ రోల్స్ పోషించింది. మరోవైపు, ఈ చిత్రంలో జగపతిబాబు పవర్ ఫుల్ విలన్ గా కనిపించనున్నారు. సి.కల్యాణ్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. మే 17న ఈ సినిమా ప్రారంభంకానుంది. జూన్ నుంచి రెగ్యులర్ షూటింగ్ కొనసాగుతుంది.

More Telugu News