Vijay Sai Reddy: టీవీ9 చానల్ ను అడ్డంపెట్టుకుని చంద్రబాబు సాగించిన నాటకం బట్టబయలైంది: విజయసాయిరెడ్డి

షార్ట్స్‌లో చూడండి
తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ న్యూస్ చానల్ గా గుర్తింపుపొందిన టీవీ9 ఇటీవలే కొత్త యాజమాన్యం చేతుల్లోకి వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో చానల్ సీఈఓ రవిప్రకాశ్ ఫోర్జరీకి పాల్పడ్డారంటూ టీవీ9ని కొనుగోలు చేసిన అలంద మీడియా సంస్థ కార్యదర్శి కౌశిక్ రావు పోలీసులకు ఫిర్యాదు చేయడం తీవ్ర సంచలనం సృష్టించింది. దీనిపై వైసీపీ అగ్రనేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఘాటుగా స్పందించారు. టీవీ9 చానల్ ను అడ్డంపెట్టుకుని చంద్రబాబు సాగించిన నాటకం ఇప్పుడు బట్టబయలైందని అన్నారు.

రవిప్రకాశ్ పై కేసు నమోదైన నేపథ్యంలో, టీవీ9పై పెత్తనం జారిపోకుండా శివాజీని ఉపయోగించుకుని చంద్రబాబు పావులు కదుపుతున్నారంటూ ఆరోపణలు చేశారు. అందుకే కొత్త యాజమాన్యాన్ని కుదురుకోనివ్వకుండా కుట్రలు చేస్తున్నారని విజయసాయి మండిపడ్డారు. చంద్రబాబు ప్రయోగించిన తుప్పుపట్టిన మిస్సైళ్లలో రవిప్రకాశ్ కూడా ఒకడని ఎద్దేవా చేశారు.

మెరుగైన సమాజం పేరుతో రవిప్రకాశ్ ఎన్నో దుర్మార్గాలకు పాల్పడ్డారని, కులం లేదంటూనే గజ్జిని వ్యాపింపచేశాడని విమర్శించారు. ఈ క్రమంలో విజయసాయిరెడ్డి నటుడు శివాజీపైనా ధ్వజమెత్తారు. సినిమాల్లో అవకాశాలు లేక బ్రోకర్ అవతారం ఎత్తిన శివాజీ ఆదాయ మార్గాలపై పోలీసులు దృష్టి సారించాలని అన్నారు.
Go Back to Shorts
Vijay Sai Reddy

More Telugu News