Maharashtra: వస్త్రాల గొడౌన్ లో అగ్నిప్రమాదం.. ఐదుగురు కార్మికుల సజీవదహనం!

  • మహారాష్ట్రలోని పూణేలో ఘటన
  • కార్మికులు నిద్రపోతుండగా మంటల వ్యాప్తి
  • 4 ఫైరింజన్లతో మంటలను ఆర్పుతున్న సిబ్బంది
మహారాష్ట్రలోని ఓ వస్త్రాల గొడౌన్ లో ఈరోజు ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. పూణే జిల్లా ఉరులీ దేవాచీలో ఈరోజు ఉదయం ఒక్కసారిగా మంటలు ఎగసిపడ్డాయి. ఈ సందర్భంగా పలువురు కార్మికులు లోపల నిద్రపోతున్నారు. మంటల వేడికి మేల్కొన్న కార్మికులు తలో దిక్కుకు పరిగెత్తగా, కొందరు లోపలే చిక్కుకుపోయారు.

దట్టమైన పొగతో దారి కనిపించక మంటల్లో చిక్కుకుని ఐదుగురు కార్మికులు సజీవదహనం కాగా, పలువురికి కాలిన గాయాలు అయ్యాయి. ప్రమాద విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది 4 ఫైరింజన్లతో అక్కడకు చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు.

ఈ విషయమై పోలీస్ ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ.. గొడౌన్ లో షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ దుర్ఘటన సంభవించి ఉంటుందని అభిప్రాయపడ్డారు. ఈ ఘటనపై కేసు నమోదు చేశామనీ, దర్యాప్తు కొనసాగుతుందని పేర్కొన్నారు.
Maharashtra
Fire Accident
5 dead
Police

More Telugu News