maharshi: 'మహర్షి' సినిమాపై ప్రేక్షకుల స్పందన ఏంటంటే..!

  • మూడు వేరియేషన్స్ లో ఆకట్టుకున్న మహేశ్ 
  • విలన్ పాత్రలో మెప్పించిన జగపతిబాబు
  • ప్రేక్షకుల అంచనాలను అందుకున్న 'మహర్షి'
మహేశ్ బాబు హీరోగా నటించిన 25వ చిత్రం 'మహర్షి' ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. మహేశ్ కెరియర్ లో మైల్ స్టోన్ మూవీ అయిన ఈ చిత్రం ప్రేక్షకుల అంచనాలను అందుకుంది. సినిమా అదిరింది అంటూ ప్రేక్షకులు తమ స్పందనను తెలియజేస్తున్నారు.

ఫస్టాఫ్ లో కాలేజ్ స్టూడెంగా మహేశ్ జర్నీ సరదాగా సాగిపోయిందని... ఇంటర్వెల్ కు ముందు వచ్చే ఎమోషనల్ సీన్స్ మనసుకు హత్తుకునేలా ఉన్నాయని చెబుతున్నారు. సెకండాఫ్ లో రైతుల కోసం మహేశ్ చేసిన పోరాటం ఆకట్టుకుందని... ఎమోషన్స్ తో కూడిన క్లైమాక్స్ ప్రతి ఒక్కరినీ కదిలిస్తుందని అంటున్నారు.

మొత్తం మీద మూడు వేరియేషన్స్ లో మహేశ్ నట విశ్వరూపం ప్రదర్శించాడని చెబుతున్నారు. విలన్ పాత్రలో జగపతిబాబు మరోసారి మెప్పించాడని అంటున్నారు. మరోవైపు, ఈ సినిమాకు మంచి టాక్ రావడంతో... భారీ వసూళ్లు రాబట్టడం ఖాయమని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
maharshi
talk
tollywood
Mahesh Babu

More Telugu News