మోదీ నయా ఔరంగజేబ్.. వారణాసిలో వందలాది దేవాలయాలను కూల్చేశాడు: సంజయ్ నిరుపమ్
- కాశీ విశ్వనాథ్ కారిడార్ కోసం దేవాలయాలను కూల్చేశారు
- విశ్వనాథ్ ఆలయాన్ని దర్శించేవారి నుంచి రూ. 550 వసూలు చేయాలని మోదీ చెప్పారు
- ఔరంగజేబ్ చేయలేని పనులను కూడా మోదీ చేస్తున్నారు
ఆనాడు ఔరంగజేబ్ చేయలేకపోయిన పనులను ఇప్పుడు మోదీ చేస్తున్నారని నిరుపమ్ విమర్శించారు. ఒకసారి కాశీ వీధుల్లోకి ఔరంగజేబ్ వచ్చారని, మన దేవాలయాలను కూల్చేసేందుకు యత్నించారని... కానీ, స్థానికులు అడ్డుపడి దేవాలయాలను రక్షించుకున్నారని చెప్పారు. అలాంటి నిరసనే ఇప్పుడు కూడా వారణాసి వీధుల్లో చోటు చేసుకునే అవకాశం ఉందని అన్నారు.