Telangana: తెలంగాణలో సినిమా టికెట్ల ధరలు పెరిగాయన్న ప్రచారం నమ్మొద్దు: మంత్రి తలసాని

  • ఈ నెల 9న విడుదల కానున్న‘మహర్షి’
  • టికెట్ల ధరలు పెరిగాయంటూ ప్రచారం
  • ఈ ప్రచారాన్ని నమ్మకండి
ప్రముఖ నటుడు మహేశ్ బాబు నటించిన మహర్షి సినిమా ఈ నెల 9న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో పలు మల్టీప్లెక్స్ ల యాజమాన్యాలు టికెట్ల రేట్లు పెంచి అమ్ముతున్నట్టు వార్తలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పందిస్తూ, తెలంగాణలో సినిమా టికెట్ల ధరలు పెంచలేదని స్పష్టం చేశారు. టికెట్ల ధరల పెంపునకు ప్రభుత్వం ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని చెప్పారు. సింగిల్ స్క్రీన్ థియేటర్ లో టికెట్ ధర రూ.80 నుంచి రూ.110కి, మల్టీప్లెక్స్ లలో టికెట్ ధర రూ.138 నుంచి రూ.200కు పెంచినట్టు వస్తున్న ప్రచారం నిజం కాదని, ఈ ప్రచారాన్ని నమ్మొద్దని కోరారు.
Telangana
minister
talasani
Maharshi
movie

More Telugu News