Andhra Pradesh: ఏపీలో విజయం సాధించబోతున్నాం: వైసీపీ నేత బొత్స ధీమా

  • జగన్ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం
  • వైఎస్ రాజశేఖర్ రెడ్డి కలలు కన్న ప్రాజెక్టు పోలవరం
  • ఈ ప్రాజెక్టుని నిర్ణీత సమయంలో జగన్ పూర్తి చేస్తారు
ఏపీ ప్రజల ఆశీస్సులతో విజయం సాధించబోతున్నామని వైసీపీ నేత బొత్స సత్యనారాయణ ధీమా వ్యక్తం చేశారు. రాజమండ్రిలో ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, జగన్ నేతృత్వంలో త్వరలోనే వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నామని వ్యాఖ్యానించారు.

దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి కలలు కన్న ప్రాజెక్టు పోలవరం అని, ఆయన హయాంలో ఈ ప్రాజెక్టు పనులు మొదలైన విషయాన్ని ఆయన గుర్తుచేసుకున్నారు. అప్పట్లో ఇన్ చార్జి మంత్రిగా తాను కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నానని అన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి బతికి ఉన్నట్టయితే ‘పోలవరం’ ఫలితాలను ప్రజలు ఇప్పటికే అనుభవించే వారని అన్నారు. పోలవరం ప్రాజెక్టుని ఆయన కుమారుడిగా జగన్ నిర్ణీత సమయంలో పూర్తి చేస్తారని అన్నారు.
Andhra Pradesh
YSRCP
botsa
polavaram
jagan

More Telugu News