KCR: కేసీఆర్ అంచనాల ప్రకారం ఎన్డీయే, యూపీఏ మెజారిటీ సాధించలేవు: కేరళ సీఎం

  • కేసీఆర్ తో భేటీ వివరాలు వెల్లడించిన కేరళ సీఎం
  • కీలక చర్చ జరిగింది
  • దేశ రాజకీయ పరిస్థితులపై కేసీఆర్ తో చర్చించాం

ఎన్డీయే, యూపీఏ కూటములకు ప్రత్యామ్నాయంగా ఫెడరల్ ఫ్రంట్ పేరిట మూడో ఫ్రంట్ ను ఏర్పరచాలని భావిస్తున్న తెలంగాణ సీఎం కేసీఆర్ ఈ మేరకు తన ప్రయత్నాలు ముమ్మరం చేశారు. సోమవారం కేరళ వెళ్లి సీఎం పినరయి విజయన్ తో భేటీ అయ్యారు. దీనిపై కేరళ సీఎం మీడియాకు వివరాలు తెలిపారు.

కేసీఆర్ తో ఎంతో అర్థవంతమైన చర్చలు జరిగాయని, దేశ రాజకీయ స్థితిగతులపై మాట్లాడుకున్నామని వెల్లడించారు. కేసీఆర్ అంచనాల ప్రకారం ఈ ఎన్నికల్లో ఎన్డీయే, యూపీఏ మెజారిటీ అందుకోలేవని, ప్రాంతీయ పార్టీలే ఆధిక్యం సాధిస్తాయని విజయన్ తెలిపారు.

ఫెడరల్ ఫ్రంట్ సమాఖ్య, లౌకిక విధానాల కలయిక అని, కేంద్రంలో ఈసారి ప్రభుత్వం ఏర్పాటు చేయబోయేది సమాఖ్య, లౌకికవాద పార్టీల కూటమేనని అన్నారు. అయితే, ఫెడరల్ ఫ్రంట్ విషయంలో ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరన్న దానిపై తాము చర్చించలేదని స్పష్టం చేశారు.

More Telugu News