Krishna District: దగ్గుబాటి వెంకటేశ్వరరావు తోక పట్టుకుని గోదావరి ఈదే రకం దాసరి బ్రదర్స్: వల్లభనేని వంశీ
- తల్లి పాలు తాగి రొమ్ము గుద్దే రకం దాసరి బ్రదర్స్
- వీళ్లు ఎక్కడా స్థిరంగా ఉండే వాళ్లు కాదు
- ఎన్నికల రిజల్ట్స్ వచ్చాక వీళ్లెవరూ ఊళ్లల్లో కనబడరు
దగ్గుబాటి వెంకటేశ్వరరావు తోక పట్టుకుని గోదావరి ఈదే రకం దాసరి బాల వర్ధనరావు, దాసరి జై రమేశ్ లు అని గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ విమర్శించారు. ‘టీవీ 9’ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, తల్లి పాలు తాగి రొమ్ము గుద్దే రకం దాసరి బ్రదర్స్ అని, వీళ్లు ఎక్కడా స్థిరంగా ఉండే వాళ్లు కాదని విమర్శించారు. వాళ్ల గురించి పెద్దగా మాట్లాడాల్సిన అవసరం లేదని అన్నారు. ఈ నెల 23న ఎన్నికల ఫలితాలు వెలువడ్డాక వీళ్లు ఎవరూ ఊళ్లల్లో కనబడరని ఎద్దేవా చేశారు.
టీడీపీని వీడతారన్న ప్రచారంపై వల్లభనేని వంశీ స్పందిస్తూ, పార్టీని వీడాల్సిన అవసరం తనకు లేదని స్పష్టం చేశారు. ఎప్పటికీ తాను టీడీపీలోనే ఉంటానని ఘంటాపథంగా చెప్పారు. ఈ ఎన్నికల్లో వైసీపీ గెలిచే ప్రస్తక్తే లేదని అభిప్రాయపడ్డారు. గుడివాడలో టీడీపీ గెలుస్తుందని, అలాగే, దేవినేని ఉమ మళ్లీ మంత్రి అవుతారన్న విశ్వాసం వ్యక్తం చేశారు.