modi: మోదీలాంటి మోసగాడిని నా జీవితంలో చూడలేదు: సిద్ధరామయ్య

  • ఐదేళ్లలో బీజేపీ, మోదీ చేసిందేమీ లేదు
  • అందుకే మోదీ పేరు చెప్పుకుని, ఓట్లు అడుగుతున్నారు
  • నేనేం చేశాను, మోదీ ఏం చేశారనేదానిపై చర్చకు సిద్ధంగా ఉన్నా
బీజేపీ, ప్రధాని మోదీలపై కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత సిద్ధరామయ్య నిప్పులు చెరిగారు. బీజేపీ కానీ, మోదీ కానీ గత ఐదేళ్ల పాలనలో చేసిందేమీ లేదని ఆయన విమర్శించారు. చెప్పుకోవడానికి చేసిందేమీ లేకపోవడంతో... మోదీ నామ జపం చేస్తూ, జనాల వద్ద ఓట్లను డిమాండ్ చేస్తున్నారని దుయ్యబట్టారు. దేశ ప్రజల కోసం ఏమీ చేయని మోదీ... తన మాటలతో ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. మోదీలాంటి అబద్దాలకోరుని, మోసగాడిని తన జీవితంలో ఎన్నడూ చూడలేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 2013 నుంచి 2018 వరకు తాను కర్ణాటక ముఖ్యమంత్రిగా ఉన్నానని, అదే సమయంలో మోదీ ప్రధానిగా ఉన్నారని... ఎవరు ఎలాంటి అభివృద్ధి చేశారనే విషయంపై చర్చించడానికి తాను సిద్ధంగా ఉన్నానని అన్నారు.
modi
siddharamaiah
bjp
congress

More Telugu News