k vishwanadh: అది వాళ్ల గొప్పతనం .. అందువల్లనే ఇన్ని విజయాలు సాధ్యమయ్యాయి: కె. విశ్వనాథ్

  • వాళ్లంతా పాండిత్యాన్ని పక్కన పెట్టారు
  •  నేను చెప్పింది అర్థం చేసుకున్నారు
  •  గొప్ప మనసుతో నాకు సహకరించారు  
కె.విశ్వనాథ్ దర్శకత్వం వహించిన చిత్రాలు ప్రతి మనసుపై మరిచిపోలేని ముద్ర వేస్తుంటాయి. సంగీతం .. సాహిత్యం .. నృత్యం ప్రధానంగా ఆయన సినిమాలు మనసు తెరపై అనిర్వచనీయమైన అనుభూతిని ఆవిష్కరిస్తుంటాయి. ఎంతోమంది హేమాహేమీల వంటి సంగీత దర్శకులతో .. పాటల రచయితలతో కలిసి ఆయన పనిచేశారు. ఆ విషయాన్ని గురించి తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు.

"చాలామంది ఎదుటి వ్యక్తి తమ కంటే తక్కువే అనే ఆలోచన కలిగి వుంటారు. అసలు ఎదుటి వ్యక్తి ఏం చెబుతున్నాడో బ్లాంక్ గా విందామని అనుకోరు. కేవీ మహదేవన్ గారు గానీ .. దేవులపల్లి కృష్ణశాస్త్రిగారుగానీ .. వేటూరి గారుగానీ .. సీతారామ శాస్త్రిగారుగాని నేను చెప్పేది బ్లాంక్ గా విన్నారు. వాళ్ల పాండిత్యాన్ని పక్కన పెట్టేసి, నా ఆలోచనా విధానాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించారు .. అది వాళ్ల గొప్పతనం. ఏ విషయంలోనైనా నాకు సందేహం కలిగితే సున్నితంగానే చెప్పేవాడిని .. అవసరమైతే వాళ్లు మార్చేవారు. అలా వాళ్లందరి సహకారంతోనే ఇన్ని విజయాలు సాధ్యమయ్యాయి" అని చెప్పుకొచ్చారు.
k vishwanadh

More Telugu News