గుంటూరు-ఒంగోలు ప్యాసింజర్ రైలులో షార్ట్ సర్క్యూట్.. బోగీ మొత్తానికి కరెంట్ షాక్.. పలువురికి అస్వస్థత!
- బాధితులను ఆసుపత్రికి తరలించిన రైల్వే అధికారులు
- వేజెండ్ల స్టేషన్ వద్దకు రైలు చేరుకోగానే ఘటన
- బోగీని తొలగించి మరో బోగీ అమర్చిన రైల్వే సిబ్బంది
ఈ ఘటనలో రైలులోని పలువురు ప్రయాణికులు విద్యుదాఘాతానికి లోనయ్యారు. వెంటనే చాలామంది ప్రయాణికులు రైలు బోగీ నుంచి దూకేశారు. కాగా, ఈ ఘటనలో గాయపడ్డ ప్రయాణికులను రైల్వే అధికారులు, పోలీసులు సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. ప్రమాదానికి గురైన బోగీకి అధికారులు తొలుత విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. అనంతరం రైలుకు మరో బోగీని జతచేసి పంపించివేశారు.