Kavitha: భార్యాభర్తలను కలిపిన స్థానిక ఎన్నికలు!

  • మనస్పర్థలతో ఐదేళ్లుగా దూరం
  • ఓ పార్టీ నుంచి కవితకు టికెట్ ఖరారు
  • ఈ నేపథ్యంలో కలిసిపోయిన లక్ష్మణ్, కవిత
ఐదేళ్లుగా మనస్పర్థలతో దూరంగా ఉంటున్న దంపతులు ప్రస్తుతం ఎంపీటీసీ ఎన్నికల సందర్భంగా కలిసి ప్రచారం చేయడం గ్రామంలోని వారిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. కరీంనగర్ జిల్లా మోతె గ్రామానికి చెందిన లక్ష్మణ్, కవిత దంపతులు వారి మధ్య తలెత్తిన విభేదాల కారణంగా ఐదేళ్లుగా దూరంగా ఉంటున్నారు. అయితే స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా ఓ పార్టీ నుంచి ఎంపీటీసీగా కవితకు టెకెట్ ఖరారైంది. ఈ నేపథ్యంలో కవిత, లక్ష్మణ్‌లు మళ్లీ ఏకమయ్యారు. ఎన్నికల్లో గెలిపించాలంటూ ఇద్దరూ కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు. ఐదేళ్లుగా దూరంగా ఉంటున్న ఇద్దరినీ ఎంపీటీసీ టికెట్ కలిపిందంటూ గ్రామస్థులు ఆసక్తిగా చర్చించుకుంటున్నారు.
Kavitha
Lakshman
Mothe
Karimnagar District
MPTC
Campaign

More Telugu News