narayana rao: చిరంజీవిలోను, రజనీలోను నేను చూసింది అదే: సీనియర్ నటుడు నారాయణరావు
- చిరూ, రజనిలో పట్టుదల ఎక్కువ
- ఇద్దరూ కొత్తదనాన్ని పరిచయం చేశారు
- పోటీని తట్టుకుని నిలబడ్డారు
నారాయణరావు మంచి నటుడు .. నిర్మాత కూడా. కెరియర్ ఆరంభంలో ఇటు చిరంజీవితోను .. అటు రజనీకాంత్ తోను ఆయనకి మంచి స్నేహం వుంది. ఆ ఇద్దరిలో మీరు గమనించినది ఏమిటనే ప్రశ్న తాజా ఇంటర్వ్యూలో నారాయణరావుకి ఎదురైంది. అందుకు ఆయన స్పందిస్తూ .. "చిరంజీవి - రజనీకాంత్ ఇద్దరిలోను నేను గమనించినది కృషి - పట్టుదల. ఈ రెండింటి కారణంగానే వాళ్లు అంచలంచెలుగా ఎదిగారు .. అనుకున్నది సాధించారు.
అటు తమిళంలో రజనీకాంత్ .. ఇటు తెలుగులో చిరంజీవి కొత్త ట్రెండ్ ను సృష్టించారు. తమని తాము మలచుకుంటూ కొత్తదనాన్ని పరిచయం చేశారు. అప్పటికే వున్న అగ్రహీరోల పోటీని తట్టుకుని నిలబడటమే కాకుండా, ఆ తరువాత స్టార్ హీరోగా ఎదగడం ఆషామాషీ కాదు. అలాంటి పరిస్థితిని దాటుకుని ఎదిగినతీరు ఈ ఇద్దరిలోను కనిపిస్తుంది. ఇక స్నేహితులను గుర్తుపెట్టుకుని సహాయ సహకారాలను అందించడం కూడా ఇద్దరిలో వుంది" అని చెప్పుకొచ్చారు.