paruchuri: 'కాలా' సినిమాకి అదొక మైనస్ అని నాకు అనిపించింది: పరుచూరి గోపాలకృష్ణ

  • కథ ఆరంభంలోనే కథాబీజం చెప్పేశారు
  •  రజనీని నలుగురు బిడ్డల తండ్రిలా చూపించారు
  •  రజనీ కొడుకుగా వేసిన పాత్ర కుదరలేదు

తాజాగా పరుచూరి గోపాలకృష్ణ 'పరుచూరి పాఠాలు' కార్యక్రమంలో 'కాలా' సినిమాను గురించి మాట్లాడారు. 'కబాలి' సినిమా పెద్దగా ఆడకపోయినా, ఆ దర్శకుడిని నమ్మి రజనీ 'కాలా' చేసే ఛాన్స్ ఇచ్చారు. అందువలన తప్పకుండా ఈ సినిమా బాగుంటుంది అనే అనుకున్నాను. తమిళనాడులో సంగతేమిటోగానీ, తెలుగులో అంత మంచి రిజల్ట్ వచ్చినట్టుగా అయితే అనిపించలేదు. ఇది భూమి కోసం మనిషిని అణచివేసే కథ .. ముఖ్యమైన విషయమేమిటంటే ఇది కొత్త కథ కాదు.

దర్శకుడు కథ ఆరంభంలోనే కథా బీజం చెప్పేశాడు. అంతే కాదు ఓపెనింగ్ సీన్ చూస్తున్నప్పుడే పాత కథ చూస్తున్నానేమో అనే ఫీలింగ్ ప్రేక్షకులకు కలుగుతుంది. కథనంలో అనూహ్యమైన మలుపులు చూపించే అవకాశమేదైనా వుందా? అంటే, హీరోను నలుగురు బిడ్డల తండ్రిగా చూపించారు. అంత వయసున్న పాత్రలో రజనీని చూపిస్తున్నప్పుడు, పెద్ద కొడుకుగా యూత్ కి కనెక్ట్ అయ్యే పాత్ర కూడా రజనీతో వేయిస్తే ఎలా వుండునో కదా అనిపిస్తుంది. యంగ్ హీరో కథ కుదరకపోవడం ఈ సినిమాకి ఒక మైనస్ అని నేను భావిస్తున్నాను" అని చెప్పుకొచ్చారు.

More Telugu News