raviteja: 'డిస్కో రాజా' నిర్మాతతో రవితేజకి విభేదాలు?

  • రవితేజ హీరోగా 'డిస్కోరాజా'
  • బడ్జెట్ తగ్గించిన నిర్మాత 
  • షూటింగు ఆగిపోయిందని టాక్

వరుస పరాజయాల తరువాత రవితేజకి 'రాజా ది గ్రేట్' తో హిట్ దక్కింది. హమ్మయ్య గాడిలో పడిపోయాడని అభిమానులు అనుకుంటే, ఆ తరువాత నుంచి పరాజయాలు మళ్లీ మొదలయ్యాయి. ఈ నేపథ్యంలోనే ఆయన వీఐ ఆనంద్ దర్శకత్వంలో 'డిస్కోరాజా' అనే సైన్స్ ఫిక్షన్ చేస్తున్నాడు. రామ్ తాళ్లూరి నిర్మాణంలో ఈ సినిమా రూపొందుతోంది.

ఈ సినిమా మేజర్ షెడ్యూల్ షూటింగు ఈ పాటికే మొదలుకావలసి వుంది. కానీ ఇంతవరకూ అందుకు సంబంధించిన సందడి ఎక్కడా కనిపించడం లేదు. నిర్మాతకీ .. రవితేజకి మధ్య తలెత్తిన విభేదాలే అందుకు కారణమనే టాక్ ఫిల్మ్ నగర్లో వినిపిస్తోంది. ఈ సినిమా బడ్జెట్ ను 40 కోట్ల నుంచి 30 కోట్లకి కుదించడం .. విజువల్ ఎఫెక్ట్స్ కి సంబంధించిన కొన్ని సీన్స్ లేపేయమని ఆయన పట్టుబట్టడం రవితేజకి కోపం తెప్పించాయని అంటున్నారు. ఈ కారణంగానే షూటింగు ఆగిపోయిందని చెప్పుకుంటున్నారు. ఇందులో వాస్తవమెంతన్నది చూడాలి మరి. 

More Telugu News