Telangana: ఫలించిన కేసీఆర్ ఫోన్ దౌత్యం.. ఈరోజు 2.5 టీఎంసీల నీటిని విడుదల చేస్తామన్న కర్ణాటక!

  • మూడు టీఎంసీల నీటిని కోరిన కేసీఆర్
  • తాగునీటికి ఇబ్బంది పడుతున్నామని వ్యాఖ్య
  • సానుకూలంగా స్పందించిన సీఎం కుమారస్వామి

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దౌత్యం ఫలించింది. తాగునీటి ఎద్దడిని తట్టుకోవడానికి 3 టీఎంసీల నీటిని విడుదల చేయాలని ఈరోజు కేసీఆర్ కర్ణాటక సీఎం కుమారస్వామికి ఫోన్ చేశారు. ఇందుకు సానుకూలంగా స్పందించిన కుమారస్వామి, తొలుత సాగునీటి అధికారులతో చర్చించారు. అనంతరం 2.5 టీఎంసీల నీటి విడుదలకు అంగీకరించారు.

ఈ సందర్బంగా కేసీఆర్ కు ఫోన్ చేసిన కుమారస్వామి, తాము 2.5 టీఎంసీలను ఈరోజు సాయంత్రం విడుదల చేస్తామని చెప్పారు. దీంతో కేసీఆర్ కుమారస్వామికి కృతజ్ఞతలు తెలిపారు. కాగా, నారాయణపూర్ రిజర్వాయర్ నుంచి ఈరోజు సాయంత్రం మహబూబ్ నగర్ లోని జూరాల ప్రాజెక్టుకు 2.5 టీఎంసీల నీరు విడుదల కానుంది. 1996లో నిర్మించిన జూరాల ప్రాజెక్టుతో 1.20 లక్షల ఎకరాలకు సాగునీరు అందించవచ్చు. ఈ ప్రాజెక్టు సామర్థ్యం 9.68 టీఎంసీలు.

More Telugu News