Andhra Pradesh: ఏపీలో త్వరలో స్థానిక ఎన్నికలు: రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్

  • మూడు దశల్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తాం
  • మొదట గ్రామ పంచాయతీలకు
  • రెండో దశలో ఎంపీటీసీ, జెడ్పీటీసీలకు
  • మూడో దశలో మున్సిపాలిటీకి

ఏపీలో త్వరలో స్థానిక ఎన్నికలు నిర్వహించనున్నట్టు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వెల్లడించారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ఈ రోజు ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మూడు దశల్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పారు. మొదట గ్రామ పంచాతీయలకు, రెండో దశలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మూడో దశలో మున్సిపాలిటీ ఎన్నికలు నిర్వహించనున్నట్టు చెప్పారు.

బ్యాలెట్ విధానంలో గ్రామపంచాయతీ ఎన్నికలు, ఈవీఎంలతో ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పారు. గతంలో 60 శాతం రిజర్వేషన్లు అమలు చేశామని, యాభై శాతానికి మించి రిజర్వేషన్లు అమలు చేయొద్దని సుప్రీం కోర్టు ఆదేశించిందని గుర్తు చేశారు. రిజర్వేషన్లపై కొత్త ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని, మునిసిపాలిటీల్లో విలీనానికి సంబంధించిన వివాదాలపై నిర్ణయం తీసుకోవాలని, విలీన వివాదాలపై మున్సిపల్ శాఖ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని అన్నారు.

More Telugu News