Sri Lanka: భారత ఫొటో జర్నలిస్టును అరెస్ట్ చేసిన శ్రీలంక

  • పేలుళ్లలో ప్రాణాలు కోల్పోయిన విద్యార్థి  
  • వివరాలు తెలుసుకునేందుకు స్కూల్లోకి
  • ఈ నెల 15 వరకు రిమాండ్

ఢిల్లీకి చెందిన ఫొటో జర్నలిస్టును శ్రీలంక పోలీసులు అరెస్ట్ చేశారు. ఈస్టర్ సండే  పేలుళ్ల అనంతర పరిణామాలకు సంబంధించిన వార్తలను కవర్ చేసేందుకు వెళ్లిన ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనుమతి లేకుండా ఓ స్కూల్‌లోకి వెళ్లాడంటూ పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు.

సిద్దిఖి అహ్మద్ డానిష్ ఢిల్లీలో రాయటర్స్‌ న్యూస్ ఏజెన్సీలో ఫొటో జర్నలిస్ట్. ఉగ్రదాడుల అనంతరం పరిణామాలను ఫొటోల్లో బంధించేందుకు ఇటీవల ఆయన శ్రీలంక వెళ్లారు. నెగొంబోలోని ఓ స్కూలు అధికారులతో మాట్లాడేందుకు ఆయన బలవంతంగా లోపలికి వెళ్లాడని ఆరోపిస్తూ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం నెగొంబో మేజిస్ట్రేట్ ఎదుట ప్రవేశపెట్టారు. ఈ నెల 15 వరకు మేజిస్ట్రేట్ ఆయనకు రిమాండ్ విధించినట్టు తెలిపారు.

స్థానిక మీడియా కథనం ప్రకారం.. సెయింట్ సెబాస్టియన్ చర్చిలో జరిగిన ఉగ్రదాడిలో ఓ స్కూలు విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. అతడికి సంబంధించి మరిన్ని వివరాలు సేకరించేందుకు సిద్దిఖీ స్కూలులోకి వెళ్లాడు. ఆ సమయంలో అక్కడే ఉన్న బాధిత విద్యార్థి తల్లిదండ్రులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారొచ్చి సిద్దిఖీని అరెస్ట్ చేసి తీసుకెళ్లారు.

More Telugu News