Srinivasreddy: బైక్ పై సైకో కిల్లర్ శ్రీనివాస్ రెడ్డి విన్యాసాలు... వైరల్ వీడియో!

  • హాజీపూర్ లో సీరియల్ మర్డర్లు
  • ప్రధాన నిందితుడు శ్రీనివాస్ రెడ్డి
  • బైక్ పై స్నేహితుడితో కలిసి ఫీట్స్

హాజీపూర్ గ్రామంలో వెలుగులోకి వచ్చిన సీరియల్ మర్డర్ల కేసులో ప్రధాన నిందితుడు శ్రీనివాస్ రెడ్డికి చెందిన ఓ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఎవరితోనూ కలవకుండా, ఎప్పుడూ ముభావంగా ఉండే శ్రీనివాస్ రెడ్డి, తన మిత్రుడితో కలిసి ఓ బైక్ పై విన్యాసాలు చేస్తూ వెళుతున్నాడు.

గ్రామంలోకి ఎప్పుడు వచ్చినా కొత్త కొత్త బైక్ లు తెచ్చి, రెండు మూడు రోజులు తిరిగి వెళుతుండే శ్రీనివాస్ రెడ్డి, బైక్ పై వెనుక కూర్చుని ఉండగా తీసిన వీడియో ఇది. ఇటీవల ఓ వివాహానికి వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో ఇది తీసినట్టు తెలుస్తోంది. ఇక ఈ వీడియోలో బైక్ ను నడుపుతున్న మరో యువకుడి గురించి ఆరా తీస్తున్న పోలీసులు, అతన్ని అదుపులోకి తీసుకుని, విచారించాలని నిర్ణయించుకున్నారు.

More Telugu News