మీది నిజంగా కల్వకుంట్ల వంశమే అయితే.. నాపై దావా వెయ్: కేటీఆర్‌కు రేవంత్‌రెడ్డి సవాల్
- పరువు ఉన్నవాళ్లే పరువునష్టం దావా వేస్తారు
- నేను చేసిన ఆరోపణలకు నేటికీ కట్టుబడి ఉన్నా
- ఆరోపణలు నిరూపించుకోలేకపోతే ఏ శిక్షకైనా సిద్ధం
కేటీఆర్‌పై తాను చేసిన ఆరోపణలను నిరూపించేందుకు తాను సిద్ధంగా ఉన్నట్టు రేవంత్ తెలిపారు. పరువు ఉన్నవాళ్లే పరువునష్టం దావా వేస్తారని, కేటీఆర్ ఏ ముఖం పెట్టుకుని దావా వేస్తారని దుయ్యబట్టారు. తాను చేసిన ఆరోపణలకు ఇప్పటికీ కట్టుబడే ఉన్నానని తెలిపారు. 20 ఏళ్లుగా పారదర్శకంగా పరీక్షలు నిర్వహిస్తున్న సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ (సీజీజీ)ని కాదని మ్యాగ్నెటిక్ ఇన్ఫోటెక్‌కు టెండర్ ఎందుకు కట్టబెట్టాల్సి వచ్చిందో కేటీఆర్ చెప్పాల్సిందేనని డిమాండ్ చేశారు. తాను చేసిన ఆరోపణలను నిరూపించుకోలేకపోతే ఏ శిక్షకైనా తాను సిద్ధమేనని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.