Guntur District: ఎన్నికల ఫలితాలపై బెట్టింగ్ .. మంగళగిరిలో ఏడుగురి అరెస్టు!

  • నిందితుల నుంచి రూ.10.15 లక్షలు స్వాధీనం
  • ఒక కారు, 7 సెల్ ఫోన్స్ కూడా
  • గుంటూరు అర్బన్ పోలీసుల వెల్లడి
ఏపీలో ఎన్నికల ఫలితాలు వెలువడే సమయం సమీపిస్తున్న కొద్దీ ప్రధాన పార్టీలతో పాటు ఆయా పార్టీల అధినేతలు, నాయకులు, అభిమానుల్లో ఆసక్తి మరింత పెరుగుతోంది. ముఖ్యంగా, బెట్టింగ్ రాయుళ్లు ఫలానా పార్టీ గెలుపు ఖాయమంటూ బెట్టింగ్ లకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలో మంగళగిరిలో బెట్టింగ్ లు నిర్వహిస్తున్న ఏడుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో నిందితులను గుంటూరు అర్బన్ పోలీసులు మీడియా ముందు ప్రవేశపెట్టారు.

నిందితుల నుంచి రూ.10.15 లక్షల నగదు, ఒక కారు, 7 సెల్ ఫోన్స్ ను స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు చెప్పారు.  కాగా, ఈ బెట్టింగ్ లలో మధ్యవర్తులే కీలకం. బెట్టింగ్ కాసే వారు మధ్యవర్తులకు 5 శాతం కమిషన్ కూడా ఇవ్వాలి. అదేవిధంగా, బాండ్ పేపర్లపై అగ్రిమెంట్ కూడా చేసుకుంటున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా, మంగళగిరిలో నారా లోకేశ్ గెలుస్తాడని రూ.300 కోట్ల మేరకు బెట్టింగ్ లు చేసినట్టు సమాచారం.    
Guntur District
mangalagiri
Nara Lokesh
bettings

More Telugu News