nagarjuna: 'మన్మథుడు 2' షూటింగులో జాయినైన సమంత

  • నాగ్ హీరోగా 'మన్మథుడు 2'
  • పోర్చుగల్ లో జరుగుతోన్న షూటింగు
  • ప్రత్యేకపాత్రలో సమంత    

నాగార్జున కథానాయకుడిగా గతంలో వచ్చిన 'మన్మథుడు' భారీ విజయాన్ని నమోదు చేసింది. ఆ సినిమాకి సీక్వెల్ గా ఇప్పుడు 'మన్మథుడు 2' రూపొందుతోంది. ఈ సినిమాకి రాహుల్ రవీంద్రన్ దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగు 'పోర్చుగల్'లో జరుగుతోంది.

రకుల్ కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాలో, సమంత ఒక ప్రత్యేకమైన పాత్రలో కనిపించనున్నట్టు వార్తలు వచ్చాయి. అయితే అది నిజమా? కాదా? అనే సందేహం అభిమానుల్లో తలెత్తింది. ఆ సందేహాలకు తెరదించేస్తూ ఈ సినిమా షూటింగులో సమంత జాయినైంది. 'పోర్చుగల్'లో జరుగుతోన్న షూటింగులో సమంత నిన్న జాయినైంది. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై రూపొందుతోన్న ఈ సినిమాకి, చైతన్ భరద్వాజ్ సంగీతాన్ని సమకూర్చుతున్నాడు.

More Telugu News