విజయసాయిరెడ్డికి సేవామిత్ర డేటా గురించి మాట్లాడే అర్హతలేదు: బుద్ధా వెంకన్న
Add ap7am to your home Screen

విజయసాయిరెడ్డికి సేవామిత్ర డేటా గురించి మాట్లాడే అర్హతలేదు: బుద్ధా వెంకన్న

  • విజయసాయిరెడ్డి ఒక దొంగ
  • జైలు సాయిరెడ్డి అంటే అందరికీ తెలుసు
  • జగన్ గెలిచినా తెలంగాణ నుంచే పాలిస్తారు
టీడీపీ అఫిషియల్ యాప్ సేవామిత్రలో రాష్ట్రంలో ఉన్న అందరు మహిళల సమాచారం ఉందంటూ వైసీపీ నేత విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై టీడీపీ నేత బుద్ధా వెంకన్న మండిపడ్డారు. విజయసాయిరెడ్డి ఒక దొంగ అని, ఏపీలో విజయసాయిరెడ్డి అంటే ఎవరికీ తెలియదని, జైలు సాయిరెడ్డి అంటే అందరికీ తెలుసని ఎద్దేవా చేశారు. అలాంటి వ్యక్తికి సేవామిత్రలో ఉన్న డేటా గురించి మాట్లాడే అర్హతలేదని అన్నారు. ఇక జగన్ పైనా. వైసీపీపైనా బుద్ధా విమర్శలు చేశారు. జగన్ గెలిచినా తెలంగాణ నుంచే పరిపాలన చేస్తారంటూ ఎద్దేవా చేశారు. ఎన్నికల వేళ వైసీపీ అనేక ప్రయత్నాలు చేసిందని, ఒక్కో అభ్యర్థి కోసం ఏకంగా రూ.20 కోట్లు పంపించారని ఆరోపించారు. మొత్తమ్మీద వైసీపీ ఎన్నికల ఖర్చు రూ.8000 కోట్లు అని అన్నారు.
Telugudesam
Jagan
Vijay Sai Reddy

More Telugu News