stock market: స్వల్ప నష్టాల్లో మార్కెట్లు.. కుప్పకూలిన యస్ బ్యాంక్ షేరు!

  • 35 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
  • 6 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ
  • 30 శాతం వరకు పతనమైన యస్ బ్యాంక్

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు స్వల్ప నష్టాలతో ముగిశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 35 పాయింట్లు నష్టపోయి 39,031కి పడిపోయింది, నిఫ్టీ 6 పాయింట్లు కోల్పోయి 11,748 వద్ద స్థిరపడింది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
హెచ్సీఎల్ టెక్నాలజీస్ (4.00%), టాటా స్టీల్ (2.10%), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (1.77%), ఇన్ఫోసిస్ (1.74%), ఏషియన్ పెయింట్స్ (0.89%).

టాప్ లూజర్స్:
యస్ బ్యాంక్ (-29.23%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (-5.21%), హీరో మోటో కార్ప్ (-3.51%), మారుతి సుజుకి (-2.54%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (-2.36%).          

ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్ అయిన యస్ బ్యాంక్ ఈరోజు కుప్పకూలింది. దాదాపు 30 శాతం వరకు పతనమైంది. మార్చి 31తో ముగిసిన త్రైమాసికానికి గాను రూ. 1,506 కోట్ల నికర నష్టాలను యస్ బ్యాంక్ ప్రకటించడమే దీనికి కారణం.

More Telugu News