puri: ఆ దర్శకుడితోనే ఆకాశ్ పూరి తదుపరి సినిమా?

షార్ట్స్‌లో చూడండి
ఒకవైపున దర్శకుడిగా తను హిట్ ను అందుకునే ప్రయత్నాలు చేస్తూనే, మరో వైపున తన తనయుడైన ఆకాశ్ ను హీరోగా నిలబెట్టడానికి పూరి గట్టి ప్రయత్నాలే చేస్తున్నాడు. ఆకాశ్ హీరోగా తను తెరకెక్కించిన 'మెహబూబా' పరాజయంపాలు కావడంతో, ఆ తరువాత సినిమా దర్శకత్వ బాధ్యతలను తన శిష్యుడైన అనిల్ పాడూరికి పూరి అప్పగించాడు. 'రొమాంటిక్' పేరుతో ఈ సినిమా నిర్మితమవుతోంది.

ఇక ఈ సినిమా తరువాత ప్రాజెక్టును కూడా పూరి లైన్లో పెట్టేశాడని అంటున్నారు. ఈ సినిమాకి మల్లికార్జున్ దర్శకుడిగా వ్యవహరిస్తాడని చెబుతున్నారు. గతంలో కల్యాణ్ రామ్ హీరోగా ఈ దర్శకుడు తెరకెక్కించిన 'అభిమన్యు' .. 'కత్తి'.. 'షేర్' పెద్దగా ఆడలేదు. అయినా ఆయన వినిపించిన కథ నచ్చి పూరి ఓకే చేశాడని అంటున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి వుంది.
Go Back to Shorts
puri
mallikarjun

More Telugu News