Foni: అతి తీవ్ర తుపానుగా మారిన ఫణి!

  • నాలుగు రోజులుగా అల్పపీడనం 
  • ఏపీకి రూ. 200 కోట్లు విడుదల
  • ఎస్డీఆర్ఎఫ్ నుంచి నాలుగు రాష్ట్రాలకు విపత్తు నిధి

గడచిన నాలుగు రోజులుగా బంగాళాఖాతంలో తిరుగుతూ అల్పపీడనం నుంచి వాయుగుండంగా మారి, తుపానుగా రూపాంతరం చెందిన 'ఫణి' ఇప్పుడు అతి తీవ్ర తుపానుగా మారిందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రస్తుతం చెన్నైకి తూర్పు ఆగ్నేయంగా 690 కిలోమీటర్లు, మచిలీపట్నానికి ఆగ్నేయంగా 760 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైన తుపాను, మరికొన్ని గంటల్లో పెను తుపానుగానూ మారుతుందని, ఇది ఎక్కడ తీరం దాటుతుందన్న విషయాన్ని ఇప్పటికిప్పుడు కచ్చితంగా చెప్పే పరిస్థితి లేదని విశాఖపట్నం వాతావరణ హెచ్చరికల కేంద్రం తాజా బులెటిన్ లో వెల్లడించింది.

More Telugu News