సిమ్లాలో దారుణం.. కదులుతున్న కారులో యువతిపై అత్యాచారం
- నడుచుకుంటూ వెళ్తున్న యువతిని కారులోకి బలవంతంగా ఎక్కించుకున్న నిందితుడు
- ఆపై కారులో తిప్పుతూ అత్యాచారం
- నిందితుడి కోసం పోలీసుల గాలింపు
సిమ్లాలోని మాల్‌రోడ్డులో బాధితురాలు నడుచుకుంటూ వస్తుండగా ఓ కారు వచ్చి ఆగింది. అనంతరం ఆమెను బలవంతంగా కారులోకి ఎక్కించుకుని తీసుకెళ్లారు. తర్వాత కారులోనే ఓ వ్యక్తి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుడి కోసం గాలిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.