టీఆర్ఎస్‌లో సీఎల్పీ విలీన ప్రయత్నాలపై హైకోర్టును ఆశ్రయించిన ఉత్తమ్, భట్టి
- విలీన ఉత్తర్వులివ్వకుండా ఆదేశాలివ్వాలి
- విలీనానికి ముందు తమకు నోటీసులివ్వాలి
- మద్దతు ప్రకటించిన 11 మంది ఎమ్మెల్యేలు
కాంగ్రెస్ నేతల పిటిషన్‌పై హైకోర్టు రేపు విచారణ చేపట్టనుంది. ఇప్పటి వరకూ 11 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్‌కు మద్దతు ప్రకటించారు. వీరంతా కలిసి సీఎల్పీని టీఆర్ఎస్‌లో విలీనం చేయాలని స్పీకర్‌ను కోరుతున్నట్టు గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో అనర్హత పిటిషన్లపై స్పీకర్ తేల్చిన తరువాతే విలీనం తీసుకునేలా ఆదేశాలివ్వాలని కాంగ్రెస్ నేతలు పిటిషన్‌లో కోరారు.