pavitra lokesh: నాన్న చనిపోవడంతో నేను సినిమాల్లోకి వచ్చాను: నటి పవిత్ర లోకేశ్

  • నాన్నగారితో కలిసి షూటింగ్స్ కి వెళ్లే దానిని
  •  అంబరీశ్ గారు .. నాన్న మంచి స్నేహితులు
  • ఆయనే సినిమాల్లోకి రమ్మని చెప్పారు  
తెలుగు .. కన్నడ భాషల్లో నటిగా పవిత్రకి మంచి పేరుంది. తాజాగా ఐ డ్రీమ్స్ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ అనేక ఆసక్తికరమైన విషయాలను గురించి చెప్పుకొచ్చారు. 'పవిత్ర' అనే పేరును మా నాన్నగారు నాకు పెట్టారు .. నేనంటే మా నాన్నగారికి చాలా ఇష్టం. కన్నడ సినిమాల్లో అప్పట్లో ఆయన మంచి క్రేజ్ వున్న నటుడు. ఆయనతో ఒకటి రెండు సార్లు షూటింగుకి వెళ్లాను.

ఆయన కోసం వచ్చేవాళ్ల కారణంగా నాకు తెలియకుండానే సినిమా వాతావరణానికి అలవాటుపడ్డాను. దురదృష్టవశాత్తు నేను 9వ క్లాస్ పాసై 10వ తరగతిలోకి వెళ్లేముందు మా నాన్నగారు చనిపోయారు. కన్నడ స్టార్ హీరో అంబరీశ్ గారు మా నాన్నగారికి మంచి స్నేహితులు. మా నాన్నగారు చనిపోయిన తరువాత, మా కుటుంబానికి అంబరీశ్ గారు అండగా నిలిచారు. 'నువ్వు సినిమాల్లోకి రావొచ్చుగదా .. నటించవచ్చుగదా' అని ఆయనే అన్నారు. అలా ఆయన ప్రోత్సాహంతో సినిమాల్లోకి వచ్చాను" అని చెప్పుకొచ్చారు.
pavitra lokesh

More Telugu News