Telangana: కాంగ్రెస్ నేత కొండా విశ్వేశ్వరరెడ్డికి ఊరట.. బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు

  • పోలీసులను నిర్బంధించిన కేసులో ముందస్తు బెయిల్
  • ఆదేశాలు జారీచేసిన తెలంగాణ హైకోర్టు
  • గతంలో ఈ పిటిషన్ ను కొట్టేసిన నాంపల్లి కోర్టు

కాంగ్రెస్ పార్టీ నేత కొండా విశ్వేశ్వరరెడ్డికి ఊరట లభించింది. జూబ్లీహిల్స్ పోలీసులను ఇంట్లో నిర్బంధించి దూషించిన కేసులో ఆయనకు తెలంగాణ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఇందుకోసం రూ.25,000 చొప్పున రెండు పూచీకత్తులను సమర్పించాలని ఆదేశించింది. పోలీసుల విచారణకు సహకరించాలని ఈ సందర్భంగా కొండా విశ్వేశ్వరరెడ్డికి సూచించింది. అలాగే ఆయన్ను ఎట్టి పరిస్థితుల్లోనూ అరెస్ట్ చేయరాదని బంజారాహిల్స్ పోలీసులకు స్పష్టం చేసింది.

తొలుత కొండా విశ్వేశ్వరరెడ్డి ముందస్తు బెయిల్ కోసం నాంపల్లి కోర్టును ఆశ్రయించారు. అయితే ఈ పిటిషన్ ను కోర్టు కొట్టివేయడంతో ఆయన హైకోర్టును ఆశ్రయించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కొండా అనుచరుడు సందీప్ రూ.10 లక్షలతో పోలీసులకు పట్టుబడ్డాడు. ఈ వ్యవహారంలో నోటీసులు అందించేందుకు కొండా విశ్వేశ్వరరెడ్డి ఇంటికి వెళ్లగా, ఆయన తన అనుచరులతో తమను నిర్బంధించారని ఎస్సై కృష్ణ ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో కొండా విశ్వేశ్వరరెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.

More Telugu News