phoni cyclone: దిశ మార్చుకుంటున్న ‘ఫణి’ తుపాన్‌.. ఉత్తరాంధ్ర, ఒడిశా తీరంవైపు ప్రయాణం

  • మే 2, 3 తేదీల నాటికి తీరం సమీపానికి
  • ఆ సమయంలో గంటకు 150 నుంచి 185 కిలోమీటర్ల వేగంతో గాలులు
  • తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం

ప్రస్తుతం మచిలీపట్నానికి 1050 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉన్న ‘ఫణి’ తుపాన్‌ ఉత్తరాంధ్ర, ఒడిశా తీరంవైపు దూసుకువచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. దిశమార్చుకుంటున్న తుపాన్‌ కదలికలను పరిశీలిస్తున్న అధికారులు మే ఒకటి నాటికి పెను తుపాన్‌గా మారి ఉత్తరాంధ్ర వైపు ప్రయాణించే అవకాశం ఉందని చెబుతున్నారు.

 తుపాన్‌ తీరం సమీపానికి వచ్చేసరికి గంటకు 150 నుంచి 185 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపారు. తుపాన్‌ ఒడిశా దిశగా కదులుతున్న సమయంలో మే 2, 3 తేదీల్లో ఉత్తరాంధ్ర, ఒడిశా తీరంలో తేలిక పాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించారు. మే 1- 3 తేదీల మధ్య ఉత్తరాంధ్ర, ఒడిశా తీరాల్లో సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని తెలిపారు. విశాఖ, మచిలీపట్నం, నిజాంపట్నం, కృష్ణపట్నం ఓడరేవుల్లో 2వ ప్రమాద హెచ్చరికలు అమల్లో ఉన్నాయి.

More Telugu News