Telangana: తెలంగాణ ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ విడుదల

  • మే 25 నుంచి జూన్ 1 వరకూ పరీక్షలు
  • ఉదయం 9 - 12 గంటల వరకూ ఫస్ట్ ఇయర్
  • మధ్యాహ్నం 2:30 - 5:30 వరకూ సెకండ్ ఇయర్

తెలంగాణలో ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలకు తేదీలు ఖరారయ్యాయి. మే 25 నుంచి జూన్ 1 వరకూ ఈ పరీక్షలను నిర్వహించనున్నట్టు ఇంటర్ బోర్డు అధికారులు ప్రకటించారు. మే 25న ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకూ ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు, అలాగే మధ్యాహ్నం 2:30 గంటల నుంచి 5:30 గంటల వరకూ ద్వితీయ సంవత్సరం పరీక్షలను నిర్వహించనున్నట్టు ఇంటర్ బోర్డ్ ప్రకటించింది. జూన్ 1తో ఈ పరీక్షలు ముగియనున్నాయి.

More Telugu News