బీజేపీలో చేరిన ఏడుగురు మాజీ సైనికాధికారులు
- మాజీ సైనికాధికారులకు స్వాగతం పలికిన సీతారామన్
- అధికారుల సేవలను కొనియాడిన రక్షణమంత్రి
- బీజేపీలో కొనసాగుతున్న చేరికలు
బీజేపీలో చేరిన వారిలో లెఫ్టినెంట్ జనరల్ జేబీఎస్ యాదవ్, లెఫ్టినెంట్ జనరల్ ఎస్కే పల్యాల్, లెఫ్టినెంట్ జనరల్ ఆర్ఎన్ సింగ్, లెఫ్టినెంట్ జనరల్ సుతిల్ కుమార్, లెఫ్టినెంట్ జనరల్ నితిన్ కోహ్లి, కల్నల్ ఆర్కే త్రిపాఠి, వింగ్ కమాండర్ నవనీత్ మగాన్ లు ఉన్నారు. ఈ సందర్భంగా నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ, సాయుధ దళాల్లో వీరు చేసిన సేవలను కొనియాడారు.