గుంటూరులో రోడ్డు ప్రమాదం.. ‘నువ్వు తోపు రా’ హీరోకు గాయాలు.. ఓ మహిళ దుర్మరణం!
- గుంటూరు జిల్లాలోని మంగళగిరిలో ఘటన
- రహదారిపై మొక్కలకు నీళ్లు పడుతున్న మహిళ
- వేగంగా వచ్చి ఢీకొట్టిన కారు
హరనాథ్ బాబు దర్శకత్వం వహించిన ‘నువ్వు తోపు రా’ అనే సినిమాలో సుధాకర్ హీరోగా నటించాడు. ఈ సినిమా వచ్చే నెల 3న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్ కోసం హైదరాబాద్ నుంచి గుంటూరుకు వెళుతుండగా ఈ ప్రమాదం సంభవించింది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.