చావు ముంగిటా ఆమెను మోసం చేశాడు... ఎదురుగా రైలు వచ్చేసరికి ప్రియుడి జంప్!
- ప్రమాదంలో మృతి చెందిన ప్రియురాలు
- పెద్దలు పెళ్లికి అంగీకరించడం లేదని చావుకు నిర్ణయం
- చివరి నిమిషంలో హ్యాండిచ్చి పారిపోయిన ప్రియుడు
వివరాల్లోకి వెళితే...హైదరాబాద్ పాతబస్తీ వాసులుగా భావిస్తున్న ఓ ప్రేమ జంట కొన్నాళ్లుగా ప్రేమించుకుంటున్నారు. వీరి పెళ్లికి పెద్దలు అంగీకరించకపోవడంతో ఇద్దరూ కలిసి చనిపోవాలని నిర్ణయించుకున్నారు. సమీపంలోని రైలు పట్టాల వద్దకు వెళ్లి నిల్చున్నారు. అయితే, రైలు దగ్గరికి రావడాన్ని చూసి ప్రియుడు పారిపోవడంతో ఆమె మాత్రం ప్రాణాలు కోల్పోయింది. కేసు నమోదు చేసిన పోలీసులు ప్రియుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.