air india: ఎయిరిండియా సేవల పునరుద్ధరణ... ఊపిరి పీల్చుకున్న ప్రయాణికులు

  • సర్వర్‌ డౌన్‌తో విమానాల రాకపోకలకు అంతరాయం
  • ఈ రోజు తెల్లవారు జాము నుంచి సమస్య
  • సమస్యను పరిష్కరించిన సాంకేతిక సిబ్బంది

సాంకేతిక సమస్య కారణంగా ఈరోజు తెల్లవారు జామున మూడున్నర గంటల ప్రాంతం నుంచి నిలిచిపోయిన ఎయిరిండియా విమానాల రాకపోకలను అధికారులు పునరుద్ధరించారు. సాంకేతిక సమస్య వల్ల సర్వర్‌ డౌన్‌ కావడంతో దాదాపు మూడు గంటలపాటు విమానాల రాకపోకలకు ఆటంకం ఏర్పడింది. దేశీయ, అంతర్జాతీయ విమానాలపై దీని ప్రభావం పడింది.

 దీంతో ఆయా విమానాశ్రయాల్లో ప్రయాణికులు పడిగాపులు పడాల్సి వచ్చింది. వెంటనే రంగంలోకి దిగిన సంస్థ సాంకేతిక సిబ్బంది సమస్యను పరిష్కరించి సేవలు యథాతథంగా జరిగేలా చేశారు. అయితే ఉదయం నెలకొన్న పరిస్థితి కారణంగా ఈ రోజు సాయంత్రం వరకు ఆయా సర్వీసులు ఆలస్యంగా ప్రారంభమవుతాయని, ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నామని సంస్థ ఎండీ అశ్వనీ లోహానీ తెలిపారు.

More Telugu News