విజయనగరంలో విచిత్రం.. రెండోసారి ఓటేయాల్సిందిగా పోస్టల్ బ్యాలెట్ ఉద్యోగులకు పిలుపు!
- జిల్లాలోని బొబ్బిలిలో ఘటన
- అధికారుల నిర్లక్ష్యమే కారణమని అనుమానం
- గందరగోళంపై స్పష్టత ఇచ్చిన రిటర్నింగ్ అధికారి జయరాం
అయితే పోస్టల్ బ్యాలెట్ ఓటు వేసిన ఉద్యోగులు తమ పేరుకు ఎదురుగా టిక్ పెట్టకుండా వదిలేయడం, ఎవరెవరు ఓటు వేశారో రికార్డుల్లో నమోదు చేయకపోవడం కారణంగా ఈ గందరగోళం నెలకొన్నట్లు చెబుతున్నారు. కాగా, ఉద్యోగుల చిరునామాలు సరిగ్గా లేనందున కొందరు ఉద్యోగులకు రెండేసి సార్లు ఓట్లు వెళ్లాయని నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి జయరాం తెలిపారు. ఇలా 12 మందికి రెండు సార్లు పోస్టల్ బ్యాలెట్ ఓట్లు అందినట్లు గుర్తించామన్నారు.