Hyderabad: నిప్పుల కొలిమిని తలపిస్తున్న తెలంగాణ.. 45 డిగ్రీలకు పగటి ఉష్ణోగ్రతలు

  • మరింత పెరగనున్న పగటి ఉష్ణోగ్రతలు
  • నిజామాబాద్ జిల్లాలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు
  • అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దంటూ హెచ్చరికలు

తెలంగాణ ఉడుకుతోంది. నిప్పుల కొలిమిలా మారింది. పగటి ఉష్ణోగ్రతలు ఏకంగా 45 డిగ్రీలకు చేరుకోవడంతో హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. శుక్రవారం అత్యధికంగా నిజామాబాద్ జిల్లా కోరట్‌పల్లి, మంచిప్పలలో 45.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మోర్తాడ్‌లో 45.3 డిగ్రీలు, లక్ష్మాపూర్‌, ఆదిలాబాద్‌ జిల్లా బేల, జైనథ్‌లో 45.4 డిగ్రీలు, నిజామాబాద్‌లో 44.7 డిగ్రీలు, రామగుండంలో 44 డిగ్రీలు, ఆదిలాబాద్‌లో 43.8 డిగ్రీలు, హైదరాబాద్‌లో 41.2 డిగ్రీలు నమోదైంది.

నిజానికి వాతావరణ శాఖ నిబంధనల ప్రకారం.. పగటి ఉష్ణోగ్రత 45 డిగ్రీలుగా నమోదైతే వడగాలులు వీస్తున్నట్టే లెక్క. దీంతో అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎంతో అవసరమైతే తప్ప ఎండలో బయటకు రావొద్దని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో బయటకు రావాల్సి ఉంటే తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. 

More Telugu News