KCR: ఇంత ఘోరమైన ఈ ప్రభుత్వాన్ని తరిమి కొట్టే వరకూ ఉద్యమిస్తాం: విద్యార్థి సంఘాలు

  • కొనసాగుతున్న ఆందోళనలు
  • సీపీఎం నేతల అరెస్ట్
  • కేసీఆర్‌వి కంటి తుడుపు చర్యలు
ఇంటర్ ఫలితాల విషయంలో జరిగిన అవకతవకలపై ఇంకా ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. నేడు ఎన్ఎస్‌యూఐ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్, ధర్నాచౌక్ వద్ద ఆందోళన చేశారు. మరోవైపు ఇంటర్ బోర్డ్ కార్యాలయం వద్ద కూడా ఉద్రిక్తత కొనసాగుతూనే ఉంది. కార్యాలయాన్ని ముట్టడించేందుకు యత్నించిన సీపీఎం నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు.

కేసీఆర్ చర్యలు కంటి తుడుపుగా ఉన్నాయని, విద్యార్థుల ఆత్మహత్యలపై ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందనా లేదని సీపీఎం నేతలు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే 20 మంది విద్యార్థులు చనిపోయారని, ఇంత ఘోరమైన ప్రభుత్వాన్ని రాష్ట్రం నుంచి తరిమి కొట్టే వరకూ ఉద్యమిస్తామని విద్యార్థి సంఘాల నాయకులు స్పష్టం చేస్తున్నారు.
KCR
Inter Result
Indira Park
CPM
Dharna Chowk

More Telugu News