Chandrababu: 'ఫణి' తుపాను నేపథ్యంలో చంద్రబాబుపై సెటైర్ వేసిన విజయసాయి

షార్ట్స్‌లో చూడండి
వైసీపీ నేత విజయసాయిరెడ్డి వ్యంగ్యభరితమైన విమర్శలు చేయడంలో ముందుంటారు. ఆయన ట్విట్టర్ అకౌంట్ లో ప్రత్యర్థులపై సెటైర్లే ఎక్కువగా కనిపిస్తాయి. తాజాగా, ముంచుకొస్తున్న 'ఫణి' తుపాను నేపథ్యంలో సీఎం చంద్రబాబుపై సెటైరికల్ ట్వీట్ చేశారు. చంద్రబాబు శాటిలైట్లతో నేరుగా సంభాషించగల సత్తా ఉన్న వ్యక్తి అని, 'ఫణి' తుపాను దిశను అంచనా వేయడంలో వాతావరణ విభాగం శాస్త్రవేత్తలు ఆయన సలహాలు స్వీకరిస్తే బాగుంటుందని వ్యంగ్యం ప్రదర్శించారు.

చంద్రబాబు ఏంటెన్నాలు రాడార్ల కంటే బలమైన సంకేతాలు పంపుతాయని ఎద్దేవా చేశారు. తిత్లీ తుపాను సమయంలో కూడా తాను చెప్పిన చోటే తుపాను తీరం దాటిందని సొంత డబ్బా కొట్టుకున్నారంటూ విమర్శించారు.
Go Back to Shorts
Chandrababu
Vijay Sai Reddy

More Telugu News