Aladdin: హాలీవుడ్ సినిమాకు వెంకటేశ్, వరుణ్ తేజ్ 'మాట' సాయం

  • అల్లాదిన్ తెలుగు వెర్షన్ కు గొంతు అరువివ్వనున్న హీరోలు
  • భూతానికి వెంకీ, అల్లాదిన్ కు వరుణ్ తేజ్ డబ్బింగ్
  •  మే 24న సినిమా విడుదల

అల్లాదిన్ కథ ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రాచుర్యం అందుకుంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరినీ ఆకట్టుకునే ఈ కథాంశంతో ఇప్పటికే పలు చిత్రాలు వచ్చాయి. తాజాగా అల్లాదిన్ పేరుతో హాలీవుడ్ లో మరో భారీ బడ్జెట్ చిత్రం తెరకెక్కింది. స్టార్ హీరో విల్ స్మిత్ జీనీ (భూతం)గా నటించిన ఈ అడ్వెంచర్ ఫిల్మ్ లో అల్లాదిన్ పాత్రను మేనా మసూద్ పోషించాడు. ఈ సినిమా మే 24న రిలీజ్ కానుంది.

ఇక ఈ సినిమా తెలుగు డబ్బింగ్ వెర్షన్ కు వెంకటేశ్, వరుణ్ తేజ్ తమ వంతు సాయం అందిస్తున్నారు. జీనీ పాత్రకు వెంకటేశ్, అల్లాదిన్ పాత్రకు వరుణ్ తేజ్ డబ్బింగ్ చెబుతున్నారు. ఈ ఇద్దరి గొంతుకలతో అల్లాదిన్ చిత్రం కాస్తంత నేటివిటీ సొబగులు అద్దుకోనుంది. ఇప్పటికే ఈ సినిమా తెలుగు టీజర్ విశేషంగా ఆకట్టుకుంటోంది.

More Telugu News