Komatireddy Venkat Reddy: ఫిరాయింపులను ప్రోత్సహించడంపైనే కేసీఆర్ దృష్టి: కోమటిరెడ్డి

  • గ్రామాల్లో సమస్యలను గాలికి వదిలేశారు
  • పరీక్షలే సరిగా నిర్వహించలేడు.. దేశాన్ని ఉద్దరిస్తాడా? 
  • గవర్నర్ ను కలసిన తర్వాత కోమటిరెడ్డి విమర్శలు 

ఇంటర్ ఫలితాల్లో జరిగిన అవకతవకలపై ప్రభుత్వంపై విపక్షాలతో పాటు విద్యార్థి సంఘాలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నాయి. ఇంటర్ ఫలితాలు వెలువడినప్పటి నుంచి మొదలైన ఆందోళనలు నేటికీ ఆగడం లేదు. నేడు విపక్షాలు గవర్నర్ నరసింహన్‌ను కలిసి ఇంటర్ ఫలితాల్లో ప్రభుత్వ వైఫల్యంపై ఫిర్యాదు చేశాయి.

అనంతరం కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీడియాతో మాట్లాడుతూ, సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇంటర్ పరీక్షలే సరిగా నిర్వహించలేని కేసీఆర్ దేశాన్ని ఉద్ధరిస్తాడా? అంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. సర్పంచ్‌లకు చెక్ పవర్ ఇవ్వకుండా గ్రామాల్లో సమస్యలను గాలికి వదిలేశారన్నారు. ఫిరాయింపులను ప్రోత్సహించడంపైనే కేసీఆర్ దృష్టంతా ఉందని కోమటిరెడ్డి విమర్శించారు.

More Telugu News