avengers endgame: చైనాలో 'అవెంజర్స్ ఎండ్ గేమ్' తొలి రోజు వసూళ్ల రికార్డ్

  • ఆసక్తిని రేపుతోన్న 'అవెంజర్స్ ఎండ్  గేమ్'
  • చైనాలో కొత్త రికార్డు నమోదు
  •  తొలి రోజునే 750 కోట్ల వసూళ్లు  

భారీ అంచనాలతో 'అవెంజర్స్ ఎండ్ గేమ్' ఈ నెల 26 తేదీన విడుదల కానుంది. దాంతో అంతా ఈ సినిమాను గురించే మాట్లాడుకుంటున్నారు. యూత్ .. ముఖ్యంగా చిన్నపిల్లలు ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఒక్క ఇండియాలోనే ఈ సినిమాకి ఇంతవరకూ 10 లక్షల టిక్కెట్లు అమ్ముడయ్యాయంటే, ఏ రేంజ్ లో క్రేజ్ వుందో అర్థం చేసుకోవచ్చు. వేసవి సెలవుల్లో వస్తోన్న కారణంగా ఈ సినిమాకి వసూళ్ల వర్షం కురవడం ఖాయమనేది విశ్లేషకుల మాట.

ఆల్రెడీ కొన్ని ఆసియా దేశాల్లో ఈ సినిమాను నిన్ననే విడుదల చేశారు. అలా చైనాలో ఈ సినిమా నిన్న భారీ స్థాయిలో విడుదలైంది. తొలిరోజునే అక్కడ ఈ సినిమా 750 కోట్ల వసూళ్లను రాబట్టినట్టు సమాచారం. ఆసియాలో తొలిరోజున అత్యధిక వసూళ్లను సాధించిన తొలి చిత్రంగా 'అవెంజర్స్ ఎండ్ గేమ్' కొత్త రికార్డును నమోదు చేసిందని చెబుతున్నారు. ఈ సినిమా కారణంగా తెలుగులో చాలా సినిమాల విడుదల వాయిదా పడటం గమనించదగిన విషయం. 

More Telugu News