Telangana: ప్రగతిభవన్ ను ముట్టడించిన జనసేన కార్యకర్తలు!

షార్ట్స్‌లో చూడండి
తెలంగాణ ఇంటర్ బోర్డు అవకతవకల వ్యవహారంపై విద్యార్థి లోకం భగ్గు మంటోంది. ఈ వ్యవహారంలో దోషులను కఠినంగా శిక్షించాలని చాలామంది విద్యార్థులు, తల్లిదండ్రులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జనసేన పార్టీ కార్యకర్తలు ఈరోజు సీఎం కేసీఆర్ నివాసమైన ప్రగతి భవన్ ను ముట్టడించేందుకు ప్రయత్నించారు.

ఆత్మహత్యలు చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు నష్టపరిహారం ప్రకటించాలని ఈ సందర్భంగా జనసేన నేతలు డిమాండ్ చేశారు. అలాగే మిగిలిన విద్యార్థులకు న్యాయం జరిగేలా చూడాలని కోరారు. ఈ సందర్భంగా జనసేన శ్రేణులను అరెస్ట్ చేసిన పోలీసులు, గోషామహల్ స్టేడియానికి తరలించారు. ఇంటర్ పరీక్షా ఫలితాల్లో అవకతవకలు చోటుచేసుకోవడంతో 21 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే.
Go Back to Shorts
Telangana
pragati bhawan
Jana Sena
Police

More Telugu News