nani: ట్రైన్ సీన్ చేయడానికి నానా ఇబ్బందులు పడ్డాము: నాని

  • మారుమూల ప్రాంతంలోని రైల్వే స్టేషన్ ను ఎంచుకున్నాము 
  • రోజు మొత్తం మీద మూడు రైళ్లే అటుగా వస్తాయి
  •  ట్రైన్ కోసం వెయిట్ చేయవలసి వచ్చేది  

నాని కథానాయకుడిగా దర్శకుడు గౌతమ్ తిన్ననూరి తెరకెక్కించిన 'జెర్సీ' భారీ వసూళ్లతో దూసుకుపోతోంది. ఈ సినిమాలో ట్రైన్ సీన్ కి అనూహ్యమైన రెస్పాన్స్ వస్తోంది. ఈ విషయాన్ని గురించి తాజాగా నాని మాట్లాడుతూ .. "క్రికెట్ టీమ్ లోకి హీరో ఎంపిక జరిగిన తరువాత 'సాధించాను' అనే ఆనందంతో రైల్వే స్టేషన్ కి వెళ్లి .. ట్రైన్ వెళుతుండగా ఫ్లాట్ ఫామ్ పై నుంచుని కసిగా అరుస్తాడు.

ఈ సీన్ కి మంచి రెస్పాన్స్ వస్తుందని అనుకున్నాను .. నా అంచనా నిజమైంది. నిజానికి ఈ సీన్ చేయడానికి మేమంతా చాలా ఇబ్బందులు పడ్డాము. జనం పెద్దగా ఉండని రైల్వే స్టేషన్లో ఈ సీన్ తీయాలనుకున్నాము. అందుకోసం ఒక మారుమూల ప్రాంతంలోని రైల్వే స్టేషన్లో షూటింగు ప్లాన్ చేసుకున్నాము. రోజు మొత్తం మీద మూడు రైళ్లు మాత్రమే అటుగా వెళతాయి. ఒక ట్రైన్ వచ్చినప్పుడు సీన్ అనుకున్నట్టుగా రాకపోతే, మరో ట్రైన్ కోసం మరో 3 గంటలు ఎదురుచూడాల్సి వచ్చేది. అలా ఆ షాట్ అనుకున్నట్టుగా రావడానికి చాలా ఇబ్బంది పడ్డాము" అని చెప్పుకొచ్చాడు.

More Telugu News