Sachin Tendulkar: ఇంటర్ కూడా పూర్తి చేయని సచిన్ టెండూల్కర్ కు శుభాకాంక్షలు: హీరో రామ్

  • ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలను ప్రస్తావించిన రామ్
  • సచిన్ ఇంటర్ చదవలేదని గుర్తు చేసిన రామ్
  • అయినా జాతికి గర్వకారణమంటూ ట్వీట్
తెలంగాణలో ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవడాన్ని ప్రస్తావిస్తూ, ఆత్మహత్యలు కూడదని చెబుతూ, భారతరత్న, దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ ను ప్రస్తావిస్తూ, హీరో రామ్ పోతినేని చేసిన ట్వీట్ ఒకటి ఇప్పుడు నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. నేడు సచిన్ పుట్టినరోజును జరుపుకుంటున్న వేళ, ఆయన ఇంటర్ కూడా పూర్తి చేయలేదని, అయినా దేశానికే గర్వకారణంగా నిలిచారని చెప్పాడు.

ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ పెడుతూ, "పార్క్‌ లో కూర్చొని బిస్కట్లు తినే పిల్లలకి ఎలా చెప్పినా వింటారు. కానీ బెడ్‌ రూమ్ లో లాక్‌ వేసుకుని జీవితం ఎలారా? అనుకునే పిల్లలకు నిజాలు ఇలా చెబితేనే వింటారు. ఇంటర్‌ కూడా పూర్తి చేయని భారత క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ కు జన్మదిన శుభాకాంక్షలు" అని వ్యాఖ్యానించాడు. దీనికి 'ఇంటర్ బోర్డ్ మర్డర్స్' అన్న ట్యాగ్ కూడా తగిలించాడు.



Sachin Tendulkar
Ram Potineni
Twitter
Birth Day

More Telugu News